What is Beneficiaries ? :- మా సేవా సంస్థ ద్వారా గ్రామీన ప్రాంతాలలో నివసిస్తున్న బీద, పేద ప్రజలకి, ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వారికి మేము ఆరోగ్య సేవలందించి ఆర్థికంగా లబ్ది చేకూర్చటమే మా లక్ష్యము.
గ్రామీన ప్రాంతలలో ఉన్న వీరికి ఆరోగ్యం పైన అవగాహన, వీరు ఆర్థికంగా లేనందున మూడ నమ్మాకాలను, నాటు వైద్యాని అనుసరిస్తున్నారని గ్రహించి, వీరి ఆరోగ్యం గురించి ఇంతవరకు (2002-2024 వరకు) 28500 మందికి ఆర్థిక లబ్థి చేకూర్చితిమి. ఇక్కడి (ఉమ్మడి జిల్లా. కరీంనగర్) వారు ఎక్కువగా వ్యవసాయం, కూలి, బిల్డింగ్ వర్క్సు, చిన్న వ్యాపారాలు చేసుకుంటు జీవిస్తారు. వీరికి సరియైన వైద్య సౌకర్యం లేదు. ఆందు వలన వీరికి మేము ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స చేసి, తగిన మందులను ఉచితంగా ఇచ్చితిమి. దీనికి తోడ్పాటుగా ‘‘ప్రథమ చికిత్స సేవా సెంటర్లను’’ ఏర్పాటు చేసితిమి. రాత్రి, పగలు అనకుండా వీటి ద్వారా ఆత్యవసర పరిస్థితిలో ( వైద్యుడు (డాక్టర్) లేని చోట) వైద్య సహాయం ఆందువరకు, ప్రథమ చికిత్సతో పాటు, హోం నర్సింగా, మెడికల్ ఎయిడ్ అందిస్తున్నాము. ప్రస్తుతం యదావిదిగా ఆరోగ్య సేవలను కోన సాగిస్తున్నాము.